పది లవంగాలు ,గుప్పెడు పుదినా ఆకులు తీసుకొని మేత్తగా రుబ్బాలి.ఈ మిశ్రమానికి కాస్తంత శనగ పిండి,చల్లని నీరు కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేయాలి ,ఆరాక చల్లని నీటి తో కడిగి వేయాలి.
లవంగాలు మొటిమలని దూరం చేస్తాయి .పైగా ఈ ప్యాక్ జిడ్డు చర్మతత్వం గల వారు వేసుకుంటే వారికి మంచిగా పని చేస్తుంది.
పొడుగాటి పాత్రలో లీటరు నీరు పోసి ,10 లవంగాలు ,చిటికెడు కర్పూరం ,గుప్పెడు పుదినా ఆకులని వేసి బాగా మరిగించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక సీసా లో పోసుకొని ఫ్రేజ్ లో పెట్టుకోండి.అవసరం అనిపించినపుడల్లా కొంచెం తీసుకొని దూది తో మొఖం పైన రుద్దుకోవాలి,
రోజుకు 4 లేక 5 చేస్తుంటే మీ మొఖం మీద జిడ్డు తొలగిపోయి మొఖం ప్రకాశవంతంగా,తాజాగా కనిపిస్తుంది.
గమనిక :
మొఖం మీద అతిగా రుద్దడం కానీ,గట్టిగా తుడుచుకోవటం కానీ చేయకూడదు,దాని వలన మొఖం కమిలిపోతుంది.
మెత్తటి గుడ్డతో నెమ్మదిగా తుడవండి.