ద్రవ పదార్ధాలు ,పోషకాలుతో వేసవిలో శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుండాలి . మిలన్లు,బెర్రీలు,కీర వంటి నీటి ఆదారిత పదార్దాలు ,పండ్లు,కూరగాయలు ,సిట్రస్ పండ్లు తింటూ ఉండాలి ,మంచి నీరు బాగా తాగుతుండాలి.
సొరకాయ,టొమాటో,కార్రోట్ ,క్యాబేజీ ,కొతిమీర ,తోటకూర వంటి రసాలు తాగాలి. కొబ్బరి నీళ్ళు ,పల్చటి మజ్జిగ ,నిమ్మ రసం శరీరానికి మేలు చేస్తాయి .
మసాలా,నూనె పదార్ధాలు ,చిరుతిండ్లు తగ్గించాలి .పూర్తిస్తాయి ధాన్యాలు,బార్లీ,మొలకలు ,పెసర పప్పు ,సలాడ్లు,పండ్లు వంటివి బాగా తినాలి.ఈ విధమైన ఆహరం తీసుకోవటం వేసవిలో ఆరోగ్యానికి , శరీరానికి, చాలా మంచిది.